అన్ని రంగాల్లోనూ వివక్ష రాజ్యమేలుతున్నది. అందులోనూ కార్పొరేట్ కారిడార్స్‌లో కనిపించని గాజు గోడలు మహిళ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ తేడా సీమా చతుర్వేదిని ఇబ్బందిపెట్టింది. రానున్న ఏడేండ్లలో.. ముప్పై లక్షలమంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఏడబ్ల్ల్యూఎఫ్ (అచీవింగ్ ఉమెన్స్ ఈక్విటీ) ఫండ్‌ను ఏర్పాటు చేశారామె. కారణాలు ఏమైనా కావచ్చు. కానీ మహిళల నేతృత్వంలోని సంస్థలకు నిధులు సమకూర్చే విషయంలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి.
వాళ్ల తరఫున బలంగా లాబీయింగ్ చేయగల వ్యక్తులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నది. ఇక ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇప్పటికే కార్పొరేట్ దిగ్గజాల నుంచి నిధుల విషయంలో సీమా చతుర్వేదికి హామీ లభించింది. ఏడబ్ల్ల్యూఎఫ్ నుంచి చంద్రకాంత సాహూ అనే ఆంత్రప్రెన్యూర్కు పెట్టుబడుల రూపంలో సాయం అందింది. ఫ్రెష్ ఓకే ఆర్ట్జ్ అగ్రీ సంస్థకు చంద్రకాంత సహ-వ్యవస్థాపకురాలు. ఈ స్టార్టప్ రసాయన ఎరువుల జాడలేని పంటలకు మద్దతు అందిస్తుంది. సీమాజీ స్వాగతిస్తున్నదీ ఇలాంటి ఆలోచనలనే.