రుతుపవనాలు
కారణాలు
1.భారతదేశం అక్షాంశపరంగా ఉత్తరార్ధగోళంలోనూ రేఖాంశాలపరంగా పూర్వార్ధగోళంలోనూ ఉండడం వల్ల భారతదేశానికి ఇరువైపులా భూ, జల విస్తరణ ఇంచుమించు సమానంగా ఉండి పీడన వ్యవస్థలో మార్పులు జరిగి రుతుపవన వ్యవస్థకు నాంది పలికాయి.
2.కర్కటకరేఖ భారతదేశం మధ్యలో నుంచి పోవడంవల్ల సూర్యగమనంలో మార్పుల ప్రభావానికి లోనైంది.
3.భారతదేశానికి ఉత్తరంగా పెద్ద భూభాగమైన ఆసియా ఖండం, దక్షిణాన పెద్ద జలభాగమైన హిందూ మహాసముద్రం అమరి ఉన్నాయి. ఈ రకమైన అమరిక ప్రపంచంలో మరెక్కడా లేదు. అందువల్ల నేల, నీరు, విభిన్న రీతుల్లో ఉష్ణోగ్రతను గ్రహించి, చల్లబడడం వల్ల రుతుపవన వ్యవస్థకు అంకురార్పణ జరిగింది.
4.రుతుపవనాలు పయనించే దారిలో ప్రథమ దేశంగా పెద్ద భూభాగంగా ఉండడం.
5.ప్రపంచంలో పెద్ద పర్వాతాలైన హిమాలయాలు భారతదేశ ఉత్తర దిక్కు పెట్టునికోటవలె ఉండి రుతుపవనాలను అడ్డగించి దేశానికి వర్షం ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి. హిమాలయాలు లేకపోతే మాసిన్రాంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది కాదు.
6.కన్యాకుమారి అగ్రం వింతైన ఆకారం వల్ల రుతుపవనాలు రెండు శాఖలై ఏ ప్రాంతాన్ని వదలక వర్షాన్నిస్తున్నాయి.
7.దేశం మూడు వైపుల సముద్రం కలిగి ఉండడం రుతుపవనాల విషయంలో శుభపరిణామం.