Telangana Bathukamma | ధర్మపురి, సెప్టెంబర్ 22: తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబురాలు దేశ విదేశాల్లో కూడా అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ మురిసేలా అమెరికాలోని డల్లాస్ స్థిరపడ్డ ధర్మపురి కి చెందిన మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ సంబురాలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తీర్కొక పూలతో బతుకమ్మను అలంకరించి, ఒక్క చోట చేరి బతుకమ్మ పాటలతో సంప్రదాయ వస్త్రాలు ధరించి మహిళలు ఆడిపాడారు. ఎక్కడ ఉన్నప్పటికీ వారి సంస్కృతి, నేపథ్యం మరువమని చాటిచెప్పేలా అంతా ఒక్క చోట చేరి బతుకమ్మ పండుగ డల్లాస్లో జరుపుకోవవం విశేషం.