Children Stories | పిసినారి డబ్బులను దొంగోడు కొట్టేస్తే.. బండలు పట్టుకుని మురువు అని ఊరిపెద్ద ఎందుకన్నడు?
Children Stories | ఒక ఊర్లె ఒక పీశినాశాయినే ఉంటుండె. ఆయినె ఎంత పీశిడంటే.. కట్టుకునే బట్టలు గొన్కొని పదేండ్లయ్యింది. పదేండ్ల కింద గొన్న బట్టల్నే.. ఇడిశిఇడిశి గడుతుండె. అట్లిట్ల జేశి గూడవెట్టిన పైసలన్ని పెద్ద సంచి నిండ జమైనయి. అవ్వి ఇంట్లుంటె.. పెండ్లాం పిల్లలు జూశి కర్సు వెడ్తరని పెరట్ల ఒక శెట్టు కింద పెద్దపొక్క దవ్వి.. అండ్ల దాశి వెట్టిండు.
తాపతాపకు పైసల్ జమగాంగనే.. ఆ పొక్క దవ్వి, గా పైసలు దీశి, అండ్ల గలిపెటోడు. అన్ని లెక్కవెట్టుకొని మురిశెటోడు. గిట్లనే శెయ్యంగ శెయ్యంగ ఒకపాలి ఈ కతంత ఓ దొంగోడు జూశిండు.
పీశినాశోడు పైసలు పాతివెట్టి పోంగనే.. ఆయిన్ని తవ్వుకొని పోయిండు. ముల్లోపారి జమైన పైసలను అండ్ల వెడ్దమని పొక్క దవ్వి జూశెవరకు.. పొక్కల ఉట్టి సంచి మిగిలింది. లబోదిబో మొత్తుకుంట ఊరిపెద్ద తానికి వోయి పిర్యాదైండు. “అయ్యో! ఎంత పనాయె! పైసలు భూమిల పాతివెట్టకుంట.. ఏదన్న వస్తువు గొనుక్కుంటె అయిపోతుండె. గట్లెట్ల జేశినవు?” అంట అనుకచ్చిండు ఊరిపెద్ద. “మంచిగున్నవు! నేను కొనుడు – గినుడు, కర్సువెట్టుడు లేదు. ఎన్నేండ్లయినా గట్లనే ఓరవెట్టుకుంట!” అంట జెప్పిండు పీశినాశోడు. “గాయింతదానికి లొల్లెందుకు? ఎట్లనన్న సూసుక ముర్సుడే గదా! ఆ సంచిల బండలు వెట్టుకొని మురువు!” అంట జెప్పి, నవ్వుకుంట వోయిండు పెద్దమనిషి.
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | మంట లేకుండానే కిచిడీ వండి.. అక్బర్‌కు బుద్ధిచెప్పిన బీర్బల్
Children Stories | గాలిమేడలు సూడాలని ఉందని అక్బర్ అడిగితే.. బీర్బల్ భలే తెలిసొచ్చేలా చేశాడు!
Children Stories | తెలివైనోడికి పెద్దపులి ఎదురొస్తే.. ఉరికిచ్చి ఉరికిచ్చి సచ్చేటట్టు చేసిండు
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

