Children Stories | తెలివైనోడికి పెద్దపులి ఎదురొస్తే.. ఉరికిచ్చి ఉరికిచ్చి సచ్చేటట్టు చేసిండు
Children Stories | గుట్టల మీద ఒక ఊళ్లె.. ఒక తెలివైనోడు ఉండెటోడు. ఆడు అసోంటిసోంటోడు గాదు. బాగా దిమాక్ ఉన్నోడు. బమ్మిని తిమ్మిని జేశెటోడు. ఒకపారి ఆయినె గుట్టల మీదుండె ఒక జీవాన్ని కొనాలని అనుకున్నడు.
Children Stories | గుట్టల మీద ఒక ఊళ్లె.. ఒక తెలివైనోడు ఉండెటోడు. ఆడు అసోంటిసోంటోడు గాదు. బాగా దిమాక్ ఉన్నోడు. బమ్మిని తిమ్మిని జేశెటోడు. ఒకపారి ఆయినె గుట్టల మీదుండె ఒక జీవాన్ని కొనాలని అనుకున్నడు. అనుకున్నది అనుకున్నట్టె.. పక్కూరి సంతకు వోయి మంచి మిథున్‌ను (గుట్టల మీదుండె ఒక రకం పశువు) గొనుక్కొని ఖుషీఖుషీగ పాటలు వాడుకుంట ఊరికి మర్లిండు. ఆళ్ల ఊరికి వోవాలంటె జంగల్లకెల్లి వోవాలె. అంతట్లకే బాగ ఆల్శమైంది. నడుసుకుంట వోంగ.. తొవ్వల ఆయినెకు ఒక పులి ఎదురైంది. అది మాలెస్క దినాలకెల్లి తిండి దినలేదు. మస్తు ఆకలిమీదుంది. ఈల్ల తొవ్వకు అడ్డమచ్చిన పులి.. “ఇగో! నీతానున్న మిథున్‌ను నాకియ్యి! లేదంటె మనిద్దరం కుస్తి వడుదాం. ఎవ్వలు గెలుత్తె ఆల్లదే జీవం!” అంట అన్నది.
ఈడు తెలివైనోడాయె.. “సరే గని, మనిద్దరం కొట్లాడుతుంటె ఈ జీవం ఎటన్న పారివోతది. ఎట్ల!?” అంట అన్నడు. “దానికేముంది. ఆ శెట్టుకు గట్టెయ్యి” అంట జెప్పింది పులి. “ఆ శెట్టు.. దీని బలం ముందు ఆగది. తెంపుకొని పోతది. ఒక పనిజేద్దాం. దీన్ని నీ నడుముకు గట్టుకో. అటెన్క మనం కుస్తీ వడుదం” అంట అన్నడు. తెలివి తక్వ పులి ‘గట్లనే!’ అంట నడుముకు మిథున్‌ను గట్టుకున్నది. నడుముకెల్లి దారందీశి కట్టుడాల్శం లేదు.. పెయ్యి మీదున్న ఎర్రసెల్లను గట్టిగ దులుపుడు దుల్పిండు మనోడు. ఎర్రసెల్లను జూడంగనె భయంతోని మిథున్ లగాయించి ఉర్కవట్టింది. దాని బలం ముంగట పులి ఆగలేదు. అటుర్క.. ఇటుర్క.. శెట్లకు – రాళ్లకు రాసుకొని పులి పిడాత జీవం ఇడిశింది. పులి పానాలు ఇడువంగనే.. ఇకమతు వారినందుకు ఖుషీ అయి మిథున్‌ను తోలుకోని తెలివైనోడు సంబురంగ ఇంటి బాటవట్టిండు.
– పత్తిపాక మోహన్
Read More :
Children Strories | బీర్బల్ చెప్పిన ఆ ఒక్క మాటతో సొంత అల్లుణ్నే జైల్లో వేసిన అక్బర్.. పూర్తి కథ వింటే నవ్వాగదు!!
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

