Children Stories | ఆంబుక్క పెడదామని వచ్చిన బమ్మ రాచ్చసుడితోనే.. బంగారం ఇప్పించుకున్న సోమరిపోతు కథ వింటే నవ్వకుండా ఉండలేరు!
Children Stories | “అమ్మయ్య! నూరోనివి దొరికినవు. మా దేశపు రాజు కొడుక్కు పచ్చవాతం అచ్చింది. నూరుగురు రాచ్చసుల గుండెకాయలతోని దిష్టి దియ్యాలె! నీతోని నూరుగురు అయిపేండ్లు!” అనుకుంట జేబులకెల్లి అద్దం దీశి, రాచ్చసునికి సూయించిండు. అండ్ల ఆని మొకం గనిపియ్యంగనే.. ‘నిజంగనే దొరకవట్టుకున్నడు!’ అనుకున్నడు బమ్మ రాచ్చసుడు.
Children Stories | ఒక ఊర్లె ఒక సోమరిపోతు ఉండెటోడు. కులకశ్పి.. సౌరం జేసుడు. కని ఎప్పుడు జూసినా.. తిని కూసునుడు, అద్దంల మొకం జూసుకునుడు తప్ప.. కశ్పి ఎన్నడు జెయ్యకపోతుండె. ఈని కత జూశిజూశి పెండ్లానికి యాట్టకచ్చింది. ఒకనాడు శీపురుకట్ట అందుకొని ఇయ్యరమయ్యర జోపి.. ఇంట్లకెల్లి ఎల్లగొట్టింది. ‘పెండ్లాం శేతుల తన్నులవడ్డ బత్కు.. ఓ బత్కేనా! మస్తు పైసలు సంపాయించినంకనే ఇంటి మొకం జూత్త!’ అనుకొని అడివిలకెల్లి పక్క దేశానికి నడుసుకుంట వోవట్టిండు. అంతట్లకే రాత్రయ్యింది. ఓ శెట్టు కింద నడుంవాల్శి పండుకున్నడు. ఆ శెట్టు మీద ఒక బమ్మ రాచ్చసుడు ఉన్నడు. ఈన్ని సూడంగనే.. మాపటికి మంచి బువ్వ దొరికిందని మస్తు ఖుషీ అయి, కిందికి దిగచ్చి ఈన్ని లేపిండు.
ఎదురుంగ రాచ్చసున్ని సూడంగనే.. ఈని పాణాలు ఠామ్మన్నయి. కని ఈడు ఇకమతులోడాయె! ఎంటనే.. “అమ్మయ్య! నూరోనివి దొరికినవు. మా దేశపు రాజు కొడుక్కు పచ్చవాతం అచ్చింది. నూరుగురు రాచ్చసుల గుండెకాయలతోని దిష్టి దియ్యాలె! నీతోని నూరుగురు అయిపేండ్లు!” అనుకుంట జేబులకెల్లి అద్దం దీశి, రాచ్చసునికి సూయించిండు. అండ్ల ఆని మొకం గనిపియ్యంగనే.. ‘నిజంగనే దొరకవట్టుకున్నడు!’ అనుకున్నడు బమ్మ రాచ్చసుడు. “నన్నిడిశి వెట్టు! నీకు బంగారమిత్త. అజ్రాలిత్త!” అంట కాల్ల బ్యారానికి అచ్చిండు. అన్నట్టే.. కాగుల నిండ బంగారాన్ని మోసుకపోయి ఈళ్ల ఇంట్ల వెట్టిండు. గిదంత పక్క శెట్టు మీదున్న ఇంకో రాచ్చసుడు జూశిండు. ‘దోస్తును ఎట్లనన్న ఇడిపించాలె!’ అనుకుని.. ఈళ్ల ఇంటి సుట్టు తిరుగవట్టిండు. ఈళ్ల గుడిశెలకు దినాం ఓ పిల్లి దొంగోలె అచ్చి.. పాలు, పెరుగు తాగవట్టింది. ఎట్లనన్న దాని ముక్కు – శెవులు గొయ్యాల్నని సోమరోని పెండ్లాం కిటికి కాడ కత్తి వట్టుకొని నక్కి కూసుంది. గిది దెల్వని రాచ్చసుని దోస్తు.. కిటికిల కెల్లి తల్కాయ లోపల వెట్టిండు. శీకట్ల సూడకుంటనే సర్రున ముక్కు గోశిందామె. లబోదిబో అనుకుంట.. మొత్తుకుంట ఉరికిండు ఆ రాచ్చసుడు. కొన్నొద్దులకు బమ్మ రాచ్చసుడు బతిలాడంగ బతిలాడంగ పాపమనిపిచ్చి.. “ఇడ్శి వెడుతున్న పో!” అంట, అద్దాన్ని తిర్లమర్ల జేసి సూపిచ్చిండు సోమరోడు. అద్దం ఎన్క దిక్కు ఏం గనవడక పోయెటాల్లకు.. ‘అమ్మయ్య!’ అనుకుంట ఉరుకు వుచ్చుకున్నడు బమ్మ రాచ్చసుడు.
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Children Stories | అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుంటరు?
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్కే రివర్స్ తగిలింది!
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

