Children Stories | నవ్వితే మల్లెపూల వాసన వస్తలేదని చిన్న రాజునే జైల్లో వేసిన పెద్ద రాజు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నవ్వాగదు!
Children Stories | ఎన్కట ఒక బుడ్డ దేశానికి ఓ రాజు ఉండెటోడు. ఆయిన్ని అందరూ ‘మల్లెపూవు రాజ కుమారుడు!’ అని పిలిశెటోళ్లు. ఎందుకంటె.. ఆయినె నవ్వితె మల్లెపువ్వు ఆసన గొట్టేది. అట్ల ఆసన రావాల్నంటే.. ఆయినె ఇట్టంగనే నవ్వాలె. గప్పుడే.. ఆ ఆసన అత్తది. కావాలని నవ్వితె రాదు.
Children Stories | ఎన్కట ఒక బుడ్డ దేశానికి ఓ రాజు ఉండెటోడు. ఆయిన్ని అందరూ ‘మల్లెపూవు రాజ కుమారుడు!’ అని పిలిశెటోళ్లు. ఎందుకంటె.. ఆయినె నవ్వితె మల్లెపువ్వు ఆసన గొట్టేది. అట్ల ఆసన రావాల్నంటే.. ఆయినె ఇట్టంగనే నవ్వాలె. గప్పుడే.. ఆ ఆసన అత్తది. కావాలని నవ్వితె రాదు. ఈనె బుడ్డ దేశం.. ఇంకో పెద్దదేశంల ఉండేటిది. ఆ పెద్ద దేశానికి ఇంకో పెద్దరాజు ఉండేటోడు. ఆయినెకు ఈనె నవ్వు గురించి అట్టిట్ల తెలిసి.. దర్బారుకు పిలిపిచ్చిండు. పెద్ద రాజు ఎంత కోశిష్ జేసినా.. నవ్వు రాలె. పెద్ద రాజుకు మస్తు కోపమచ్చింది. తాను జెప్పినా ఇంటలేడని.. శిన్న రాజును జైల్ల ఏయించిండు. నవ్వితె ఆసన అచ్చేదాకా ఇడిశి పెట్టద్దని హుకుం జేశిండు.
ఆ జైలు కిటికి ఎదురుంగ ఒక గుడిశెల ఒక కుంటాయినె ఉంటుండె. రోజు పొద్దుగాల నుంచి రాత్రి దాన్క ఆన్ని సూసుకుంటనే పొద్దు గడుపుతుండె శిన్న రాజు. ఒకరోజు రాత్రిపూట గుడిశెలకెల్లి లొల్లి ఇన రావట్టింది. నాకెందుకని సప్పుడు జేక ఊకున్నడు. తర్వాతి దినం రాత్రి గూడ మల్ల గట్టిగ లొల్లితోని.. ఇయ్యరమయ్యర ఎవలనో కొడుతున్న సప్పుడు సుతం ఇనచ్చింది. ఉబలాటం బట్టలేక కిటికీ కాడికిచ్చి కూసొని సూడవట్టిండు. ఆ దెబ్బలకు ఓర్వలేక గుడిశెలున్న ఆడిమనిషి.. “ఈని కొట్టుడుకు ఏడేడు లోకాలు గనిపిచ్చినయి. అయ్యో! అమ్మో!” అంట మొత్తుకోవట్టింది. ఆమె ఎవలో గాదు.. ఆ దేశం రాణి. ఆల్ల గుడిశె కాన్నే తిరిగితిరిగి యాష్టకచ్చి పండుకున్న ఒక ముసలాయినె ఆల్ల మాటలిని.. దబ్బున లేశి లేని కూకున్నడు. నాలుగొద్దుల కింద ఆయినె గాడిది ఎటో వేయింది. దాన్ని దేవులాడుకుంట తిరిగితిరిగి గుడిశె కాడికచ్చి పన్నడు. ‘ఏడేడు లోకాలు గనిపిచ్చినయి!’ అన్న ముచ్చటినంగనే.. “అమ్మో! జర జూశి.. నా గాడిది ఏడనన్న గనిపిచ్చిందో చెప్పు!” అంట ఒర్రిండు. ఈ కతంత జూశిన జైల్లున్న శిన్న రాజుకు మస్తు నవ్వచ్చింది. ఇరాం లేకుంట పడిపడి నవ్వవట్టిండు. ఆ ఆసనకు ఖుషీ అయిన పెద్దరాజు.. తెల్లారంగనే శిన్న రాజును దర్బార్లకు విలిపిచ్చిండు. “ఎందుకు నవ్వినవ్!?” అంట మస్తు బలవంతం జేశెటాలకు.. అసలు ముచ్చట జెప్పక దప్పలే!
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Children Stories | అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుంటరు?
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్కే రివర్స్ తగిలింది!
Children Stories | మొగులు మీద సుక్కలకు.. ఆవాలకు మస్త్ లింకు పెట్టిన బీర్బల్!
Children Stories | అరశేతుల ఎంటికలు ఎందుకు మొలవవో గమ్మతిగా జెప్పిన బీర్బల్
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

