Children Strories | పిల్లగాండ్లూ! ఇదీ అకుబర్, బీరుబల్ కతే! తెలుసుగద.. తెలివిగుంటది, గమ్మతుగుంటది! ఎప్పటిలెక్కనే అకుబర్.. బీరుబల్ను తోల్కొని ఆల్ల నగురం పక్కపొంటున్న జంగల్లకు ఏటకు పోయిండు. పోతుంటే తొవ్వపొంట శెట్లన్ని సక్కగ.. సింగారంగ గనిపిచ్చినయి. అన్ని శెట్లల్ల ఒక్క శెట్టు అంకర టింకరగ కనిపిచ్చింది. దాన్ని జూపిచ్చుకుంట.. “అవు బీరుబల్! ఈ ఒక్క శెట్టే ఇట్లెందుకు అంకరగ ఉన్నది” అంట అడిగిండు. దానికి బీరుబల్.. “హుజూర్! అది అడివి శెట్లన్నిటికీ అల్లుడు శెట్టు. మీకు ఎర్కేగద.. ‘కుక్కతోక.. అల్లుడు ఎప్పుడు అంకరే!’ అంటరు పెద్దోళ్లు!” అంట జెప్పిండు.
దానికి అకుబర్.. “అంటే మా అల్లుడు గూడ గసొంటోడేనా!” అంట అనుమానపడ్డడు. “అవు! అండ్ల అనుమానం ఏమున్నది! ఆయినె గూడ అల్లుడేనాయె!” అంట జెప్పిండు బీరుబల్. “అయితే మా అల్లుణ్ని జైల్లెయ్యుండ్రి.. అచ్చే నెల శిలువేద్దం!” అంట హుకుం జారీ జేశిండు అకుబర్. నెల రోజులైనంక బీరుబల్ మూడు శిలువలు జేయించుకుని.. దర్బార్లకు దీసుకచ్చిండు. “అగో! అల్లుడు ఒక్కడే అయితే.. మూడు శిలువలు ఎందుకు?” అంట అడిగిండు అకుబర్. “హుజూర్! ఈ ఇనుపది నాకు, ఎండిది మీకు, బంగారిది మీ అల్లునికి.. మనం ముగ్గురం గూడ అల్లుండ్లమే గద!” అంట అని సలాం జేశిండు. అకుబర్ నవ్వి.. “మా అల్లుణ్ని ఇడిశి పెట్టుండ్రి!” అంట హుకుం జారీ జేశిండుల్ల.
– పత్తిపాక మోహన్
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Children Stories | అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుంటరు?
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్కే రివర్స్ తగిలింది!