Children Stories | గాలిమేడలు సూడాలని ఉందని అక్బర్ అడిగితే.. బీర్బల్ భలే తెలిసొచ్చేలా చేశాడు!
Children Stories | ఇది గూడ అకుబర్ - బీరుబల్ కతనేనుల్లా! ఒకసారి మాపటీలి బువ్వదిన్నింక బంగ్లమీద గూసొని.. అకుబర్ - బీరుబల్ మాట్లాడుకోవట్టిండ్రు. ఆ మాటలల్ల హవా మహల్ల (గాలి బంగ్లలు) ముచ్చట అచ్చింది. ఎంటనే.. “గాలి బంగ్లలంటే ఎట్లుంటయి? అవ్వి గట్టనీకి ఎంతైతది?” అంట అడిగిండు అకుబర్.
Children Stories | ఇది గూడ అకుబర్ – బీరుబల్ కతనేనుల్లా! ఒకసారి మాపటీలి బువ్వదిన్నింక బంగ్లమీద గూసొని.. అకుబర్ – బీరుబల్ మాట్లాడుకోవట్టిండ్రు. ఆ మాటలల్ల హవా మహల్ల (గాలి బంగ్లలు) ముచ్చట అచ్చింది. ఎంటనే.. “గాలి బంగ్లలంటే ఎట్లుంటయి? అవ్వి గట్టనీకి ఎంతైతది?” అంట అడిగిండు అకుబర్. దానికి బీరుబల్.. “హుజూర్! అవి గట్టుడు అందరితోని గాదు. కట్టినా.. అంత అగ్గువల గాదు!” అంట చెప్పిండు. ఇచ్చిత్రం అనిపిచ్చి, అకుబర్ ఎంటనే.. “నాకు గాలిమేడలు సూడాలని కాయిషుగున్నది. ఎంత కర్సు అయినా.. ఎన్కముందాడకు. జల్దిన పని షురూ చేయించు!” అంట ఫర్మానేశిండు. ఇంక అన్నడుగదా!.. “ఒకటి రెండంత్రాలు గాదు.. ఎన్ని అంత్రాలు గట్టస్తె.. అన్ని గట్టు! నీ పేరు, నాపేరు నిలిశిపోవాలె!” అంట చెప్పిండు అకుబర్.
ఆ దినం కెల్లి బీరుబల్ కచేరికి అచ్చుడులేదు. ఆరం పది దినాలైంది. బీరుబల్ ఎందుకు అత్తలేడో అర్సుకొమ్మని చెప్పిండు అకుబర్. ‘పనోల్ల కోసం తిరుగుతున్న! ఆళ్లు దొరుకంగనే అచ్చి పాదుషాను కలుస్త!’ అంట చెప్పి పంపిండు బీరుబల్. పదిగేనొద్దులకు కచేరికి ఒకాయినెను తోల్కొని అచ్చిండు బీరుబల్. “నీ గాలి బంగ్లలు గట్టుడు ఏడిదాక అచ్చింది?” అంట అడిగిండు అకుబర్. “హూజూర్! గందుకే ఈనెను తీస్కచ్చిన. మీరు కొంచెంసేపు నిమ్మలంగుంటే.. గాలి బంగ్లను సూడచ్చు” అన్నడు బీరుబల్. “అన్నట్టు చెప్పుడు మరిశిన.. మన రాజ్యంల గాలి బంగ్లలు గట్టుట్ల ఈనెను మించిన సిపాయి లేడు!” అని మల్ల చెప్పిండు. “నువ్వు మస్తు పనిమంతునివని బీరుబల్ చెప్తుండంటె.. నువ్వు మామూలోనివి గానట్టె! నీ పేరేంది? ఉరేంది? ఏమేం చేత్తవో చెప్పు!” అన్నడు అకుబర్.
దానికాయినె అంగి అంగి సలాం జేసి.. “హుజూర్! నా గురించి ఏమేం చెప్పాలె!? ఎన్ని చెప్పాలె!? చెప్పుకొంటె తెల్వది. చెప్పితె ఒడువది. నాది పెద్ద కత. మా అవ్వా – నాయినకు లేకున్నా.. కోట్లు కర్సు వెట్టి నన్ను పెంచిండ్రు. ఇల్లు జాగ లేకున్నా.. మేడల్ల ఉంచిండ్రు. మా ఊరికి మస్తుమంది పయిల్వాన్లు అద్దురు. ఏడేండ్లప్పుడే ఆల్లందర్నీ ఓడిచ్చిన! అంబాడేటప్పుడే.. కుస్తీ వట్టుడు నేర్శిన. నా పేరు చెప్తే గజదొంగలు ఉచ్చవోసుకుంటరు. ఇయ్యాల మిమ్ముల్ని ఖుషీ చేసి.. చిన్న జాగీరు దీసుకుందమని అచ్చిన. ఆ జాగీరుతోని ఇంకొన్ని జాగీర్లు జమ జేసుకొని రాజునైత. రాజునైనంక ఆల్లనీల్లను గలుపుకొని, మారాజునైత.. అటెన్క పాదుషానైత!” అంట ఇంకేదో జెప్పవోయిండు. ఎంటనే అకుబర్.. “చల్ ఆపు! ఏందేందో అనాప్ సునాప్ ఒర్రుతున్నవ్! ఉత్త దేడ్ దిమాక్గానివి. నువ్వేం గాలి బంగ్లలు కడుతవు!? బీరుబల్.. గీన్నెందుకు దెచ్చినవు? గీడేం గాలి బంగ్లలు కడుతడు?” అంట కోపానికచ్చిండు. గప్పుడు బీరుబల్.. “మాఫ్కర్నా హుజూర్! గాలి బంగ్లలు, హవా మహల్లు కట్టుడంటే.. గీ తుపాకి రాముని ముచ్చటే!” అంట అనేటాల్లకు.. అసలు ముచ్చట దెలిశి, అందరు నవ్విండ్లు.
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | తెలివైనోడికి పెద్దపులి ఎదురొస్తే.. ఉరికిచ్చి ఉరికిచ్చి సచ్చేటట్టు చేసిండు
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

