Children Stories | మంట లేకుండానే కిచిడీ వండి.. అక్బర్‌కు బుద్ధిచెప్పిన బీర్బల్
Children Stories | ఇది గూడ అకుబర్ - బీరుబల్ కథేనుల్ల. ఒక సలికాలం రాత్రిపూట.. అకుబర్, బీరుబల్ యమునా నది పొంట షికారు గొడ్తున్నరు. నడుసుకుంట వోవుకుంట ఆగి.. నీళ్లల్ల ఏలువెట్టి సూశిండు అకుబర్. గా నీళ్లు సల్లగ ఇగమోలె ఉన్నయి. “అరె! ఇంత సల్లటి నీళ్లల్ల ఎవలన్న దిగుతె.. దెబ్బకు గూత్తరు. గంత ఇగమిగం ఉన్నయి” అన్నడు అకుబర్.
Children Stories | ఇది గూడ అకుబర్ – బీరుబల్ కథేనుల్ల. ఒక సలికాలం రాత్రిపూట.. అకుబర్, బీరుబల్ యమునా నది పొంట షికారు గొడ్తున్నరు. నడుసుకుంట వోవుకుంట ఆగి.. నీళ్లల్ల ఏలువెట్టి సూశిండు అకుబర్. గా నీళ్లు సల్లగ ఇగమోలె ఉన్నయి. “అరె! ఇంత సల్లటి నీళ్లల్ల ఎవలన్న దిగుతె.. దెబ్బకు గూత్తరు. గంత ఇగమిగం ఉన్నయి” అన్నడు అకుబర్. “ఏ కాదు హుజూర్! ఇంతకంటె సల్లటి నీళ్లల్ల గూడ రాత్రంత జాగారం జేశెటోళ్లున్నరు!” అంట జెప్పిండు బీరుబల్. “అయితే! ఆనికి ఎయ్యి బంగారు నాణాలిత్త.. అట్ల జేత్తె!” అంట అన్నడు అకుబర్. దాంతోని బీరుబల్ ఒకాయికెను దోల్కచ్చి.. “ఇగో సర్కార్! ఈనెనే రాత్రంత యుమునల నిలుసుంటడు” అంట సూపెట్టిండు. అన్నట్టే ఆ రాత్రంత ఆయినె సల్లటి గడ్డగట్టిన నీళ్లల్ల నిల్సొని, తెల్లారి దర్బారుకచ్చి.. ఇనాం అడిగిండు. “సరే! ఇనాం ఇత్తగని.. నీకు సలివెట్టలేదా!?” అంట అర్సుకున్నడు అకుబర్. దానికాడు ఇకమతుగ.. “ఎందుకు వెట్టలేదు హుజూర్! పెట్టింది గాని.. ఆ దూరంగున్న గుట్టమీద గుడ్డి దీపముందిగద.. దాన్ని సూసుకుంట నిలుసున్న గదా! దాని గర్మి నాకచ్చింది!” అంట జెప్పిండు. “అట్లనా! అయితె దీపం యేడి గొట్టింది గదా! ఇనాం గినాం జాన్తానై!” అంట అన్నడు అకుబర్.
ఒకపారి అకుబర్ ఒక్కడే నడుసుకుంట తోటలకెల్లి పోవట్టిండు. తొవ్వల ఒకదగ్గర మూడు రాళ్ల పొయ్యివెట్టి, ఆ పొయ్యి కింద మంట గింట ఏం లేకుండ వంట జేత్తండు బీరుబల్. ఆయినేం జేత్తుండో సమజ్గాక.. “బీరుబల్! ఏం జేత్తున్నవు?” అంట అడిగిండు అకుబర్. “కిచిడి అండుతున్న!” అంట జవాబిచ్చిండు బీరుబల్. “అగో! గిన్నె కింద మంట లేకుండ అంట ఎట్ల జేత్తున్నవు?” అని అకుబర్ అనంగనే.. “హుజూర్! మీ ఎనుకున్న గుడిశెల ముసలమ్మ అంట జేత్తంది. ఆ పొయ్యిని జూసుకుంట అండుతున్న. అదే అయితది!” అంట జవాబిచ్చిండు బీరుబల్. గా జవాబినంగనే.. సలినీళ్లల్ల నిలుసున్న మనిషి ముచ్చట, దీపం ముచ్చట యాదికచ్చినయి.
ఎమ్మట్నే ఆన్ని విలిశి, ఇనాం ఇచ్చిండు అకుబర్.
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | గాలిమేడలు సూడాలని ఉందని అక్బర్ అడిగితే.. బీర్బల్ భలే తెలిసొచ్చేలా చేశాడు!
Children Stories | తెలివైనోడికి పెద్దపులి ఎదురొస్తే.. ఉరికిచ్చి ఉరికిచ్చి సచ్చేటట్టు చేసిండు
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

