World Cup Qualifiers 2023 : ఒకప్పుడు ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటైన జింబాబ్వే(Zimbabwe) సొంత గడ్డపై గర్జించింది. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023)లో భాగంగా ఈరోజు అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 408 పరుగులు కొట్టింది. దాంతో, 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టింది. కెప్టెన్ సియాన్ విలియమ్స్(174) సెంచరీతో, గుంబీ (78) అర్ధ శతకంతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 408 రన్స్ బాదింది.
ఇంతకుముందు వన్డేల్లో జింబాబ్వే అత్యధిక స్కోర్ 351/7. కెన్యాపై 2009 జనవరి 29న స్టువార్ట్ మట్సీకెన్యరీ(90), ఎల్టన్ చిగుంబుర(68) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్బే 151 పరుగుల తేడాతో గెలిచింది.
A brilliant career-best ODI tally of 174 from @sean14williams propels 🇿🇼 to it’s highest ODI score, 4⃣0⃣8⃣/6⃣ from 50 overs. 🙌
(Williams 174, Gumbie 78, Raza 48; Paradkar 3/78, Singh 2/97, Kenjige 1/62)
📝: https://t.co/S84siqbni6#ZIMvUSA | #CWC23 pic.twitter.com/zBdxCcWhjc
— Zimbabwe Cricket (@ZimCricketv) June 26, 2023
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన జింబాబ్వే జోరు కొనసాగిస్తోంది. గత మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్త చేసిన సియాన్ విలియమ్స్ బృందం ఈరోజు ప్రతాపం చూపించింది. ఫైనల్ లీగ్ మ్యాచ్(Final League Match)లో పసికూన అమెరికాపై ఏకంగా నాలుగొందలు బాదింది. భారీ లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు 16 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. దాంతో, ఈ మ్యాచ్‌లో జింబాబ్వేకు భారీ విజయం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం జింబాబ్వే ఆరు పాయింట్లతో గ్రూప్ – ఏలో అగ్రస్థానంలో ఉంది. సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన సియాన్ సేన తదుపరి మ్యాచుల్లో ఇదే తీరుగా ఆడాలనుకంటుంది. అదే జరిగితే.. ఈసారి వరల్డ్ కప్ పోటీలకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.