Kane Williamson | గాయం నుంచి కోలుకుంటున్నా.. నా దృష్టంతా వారానికి కొంత మెరుగవ్వడంపైనే : విలియమ్సన్
Kane Williamson : న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్స( Kane Williamson)న్ ఆటకు దూరమై ఇప్పటికే మూడు నెలలు దాటింది. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఆరంభ మ్యాచ్‌లో కుడి మోకాలులోని యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్(Anterior Cruciate Ligament,) దెబ్బతినడమే అందుకు కారణం. ప్రస్తుతం స్వదేశంలో ఉన్న అతను వన్డే వరల్డ్ కప్ లోపు(ODI WC 2023) ఫిట్నెస్ సాధించాలని...
Kane Williamson : న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్స( Kane Williamson)న్ ఆటకు దూరమై ఇప్పటికే మూడు నెలలు దాటింది. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఆరంభ మ్యాచ్‌లో కుడి మోకాలులోని యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్(Anterior Cruciate Ligament,) దెబ్బతినడమే అందుకు కారణం. ప్రస్తుతం స్వదేశంలో ఉన్న అతను వన్డే వరల్డ్ కప్ లోపు(ODI WC 2023) ఫిట్నెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ న్యూజిలాండ్ కెప్టెన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు చెప్పాడు. ‘ఇంతకుముందు నాకు ఇంత పెద్ద గాయం కాలేదు. అందుకని గతంలో గాయంతో ఎక్కువ రోజులు ఆటకు దూరమైన వాళ్లతో మాట్లాడుతున్నా.
వారం నుంచి వారానికి ఎంతో కొంత మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నా’ అని విలియమ్సన్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఈ స్టార్ ఆటగాడు ఆడడం కివీస్‌కు ఎంతో ముఖ్యం. ఎందుకంటే.. అతని సారథ్యంలో న్యూజిలాండ్ రెండుసార్లు ఫైనల్స్(2015, 2019)కు దూసుకెళ్లింది. అంతేకాదు 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final) భారత్‌ను ఓడించి టెస్టు చాంపియన్‌షిప్ గద(Mace)ను సొంతం చేసుకుంది.
ఫిట్నెస్ సాధిస్తాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో విలియమ్సన్‌ను గుజరాట్ టైటాన్స్(Gujarat Titans) రూ.2 కోట్లకు దక్కించుకుంది. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆపేందుకు ప్రయత్నించి కింద పడిపోయాడు. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. స్కానింగ్‌లో అతడి కుడి మోకాలికి తీవ్ర గాయమైనట్టు తేలింది. దాంతో, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(Newzealand Cricket) అతడిని వెంటనే స్వదేశానికి రావాల్సిందిగా కోరింది. అందుకని ఈ స్టార్ ప్లేయర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ వరకు విలియమ్సన్ ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా ? అనేది తెలియదు. మిడిలార్డర్లో కీలకమైన అతను ఆలోపు ఫిట్‌గా ఉంటే బ్లాక్ క్లాప్స్ జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

