Mohammed Siraj | హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తున్నది. ప్రముఖ సింగర్‌తో డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతున్నది. తాజాగా సింగర్ బర్త్ డే వేడుకల్లో సిరాజ్ పాల్గొన్నాడు. ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించడంతో వార్తలను మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక సింగర్ ఎవరో కాదు ఆశా భోస్లే మనుమరాలు జనై భోస్లే. జనై సైతం బాలీవుడ్లో సింగర్‌గా రాణిస్తున్నది. ఇటీవల జనై 23వ బర్త్‌డే వేడుకలను జరుపుకున్నది. బర్త్‌డే పార్టీ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వేడుకల్లో సిరాజ్, జనై ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఇద్దరూ సన్నిహితంగా ఉండడంతో ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఇన్‌స్టాలోనూ ఒకరినొకరు ఫాలో అవుతుండడం విశేషం. అదే సమయంలో జైన భోస్లే ఇన్‌స్టాలో ఐపీఎల్లో కేవలం గుజరాత్ టైటాన్స్ జట్టును మాత్రమే ఫాలో అవుతుండడం గమనార్హం. ఐపీఎల్ 2025 సీజన్లో మహ్మద్ సిరాజ్ గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ ఈ హైదరాబాదీ బౌలర్‌ను రూ.12.25కోట్లకు కొనుగోలు చేసింది. సిరాజ్‌ను గుజరాత్ కొనుగోలు చేసినప్పటి నుంచి.. ఆ జట్టు ఫాలో అవుతూ వస్తున్నది. సిరాజ్‌తో ప్రేమలో ఉండడంతోనే జనై భోస్లే ఆ జట్టును ఫాలో అవుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఇందులో ఎంత వరకు నిజమున్నదో తెలియరాలేదు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సిరాజ్ లేదంటే.. జనై స్పందించాల్సిందే. పుట్టిన రోజు సందర్భంగా జనై భోస్లేకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఓ యూజర్ జనైని మీరు సిరాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా? అని ప్రశ్నించాడు. జనై ప్రస్తుతం సింగర్‌గా కొనసాగుతుండగా.. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఛత్రపతి శివాజీ మహరాజ్ మూవీలో నటిస్తున్నది. బర్త్ డే వేడుకల్లో సిరాజ్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, సిద్దేష్ లాడ్, నటుడు జాకీష్రాఫ్, ఆశా భోస్లే, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.