Zaheer Khan | టీమ్ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) తండ్రయ్యారు. ఆయన భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గే (Sagarika Ghatge) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జహీర్ – సాగరిక జంట బుధవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. బాబుకు ఫతేసిన్హ్ ఖాన్ (Fatehsinh Khan) అని పేరు కూడా పెట్టారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు జహీర్ – సాగరిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జహీర్ ఖాన్, సాగరిక ఘట్గేది ప్రేమ వివాహం. కొన్ని రోజుల డేటింగ్ అనంతరం 2017 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి వీరిద్దరూ ముంబయిలో ఆనందంగా జీవిస్తున్నారు. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ జంట తొలి బిడ్డకు జన్మనిచ్చింది.
Also Read..
Air hostess | షాకింగ్ ఘటన.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మహిళకు లైంగిక వేధింపులు
Khushboo | ఖుష్బూ స్టన్నింగ్ లుక్.. 16 ఏళ్ల టీనేజర్లా మారిపోయిన నటి
Los Angels Olympics: 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. క్రికెట్ వేదికను ప్రకటించిన ఐసీసీ