దుబాయ్: 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్(Los Angels Olympics) క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ కాంపిటీషన్‌కు చెందిన ఓ వేదికను ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది. సుమారు 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలు, పురుషల విభాగాల్లో ఆరేసి జట్లు పోటీపడనున్నాయి. లాస్ ఏంజిల్స్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొమోనా సిటీలోని ఫెయిర్‌గ్రౌండ్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం క్రికెట్ వేదికను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఐసీసీ చైర్మెన్ జే షా తెలిపారు. క్రికెట్ పాపులర్ క్రీడ అని, అయితే హద్దులు దాటి ఆ క్రీడను ఒలింపిక్స్‌లో పెట్టడం .. మెగా ఈవెంట్‌కు వన్నె తేనున్నట్లు జే షా వెల్లడించారు. టీ20 క్రికెట్ కొత్త ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నారు. 1900 సంవత్సరంలో చివరిసారి పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌కు బ్రేక్ పడింది. అయితే 2023 అక్టోబర్‌లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్లో క్రికెట్ గురించి నిర్ణయం తీసుకున్నారు.
📍 Pomona, California 🌏
Where chapters of cricket’s story at the Olympics are to be written 📚https://t.co/mpUfycpBGx
— ICC (@ICC) April 16, 2025
బేస్బాస్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్సోసీ, స్క్వాష్ ఆటలతో పాటు క్రికెట్‌ను లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కొత్తగా జోడించారు. క్రికెట్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. 2010, 2014, 2023 ఆసియా క్రీడలతో పాటు 2022 కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌ను టీ20 ఫార్మాట్లో ఆడించిన విషయం తెలిసిందే.