Khushboo | ఖుష్బూ స్టన్నింగ్ లుక్.. 16 ఏళ్ల టీనేజర్లా మారిపోయిన నటి
Khushboo | తెలుగు సినీ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) కొన్ని స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో 54 ఏళ్ల ఖుష్బూ సుందర్.. 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Khushboo | తెలుగు సినీ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) అందరికీ సుపరిచితమే. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా ఆమె ప్రజలకు దగ్గరైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె తాజాగా సోషల్ మీడియాలో కొన్ని స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసింది.
గ్రీన్ కలర్ డ్రెస్‌లో చాలా స్లిమ్‌గా ఎంతో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఆ ఫొటోల్లో 54 ఏళ్ల ఖుష్బూ సుందర్.. 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఫొటోలకు ‘బ్యాక్ టూ ద ఫ్యూచర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ మేరకు ఖుష్బూను ట్రోల్స్ చేస్తున్నారు. సన్నగా మారడానికి ఇంజెక్షన్స్ చేయించుకున్నారా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రోలర్స్‌కు ఖుష్బూ సైతం అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఎలాంటి మనుషులు..?’ అంటూ ప్రశ్నించారు. ‘మీరెప్పుడూ మీ ముఖాలను సోషల్ మీడియాలో చూపించరు. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Back to the future! 💚#greenwithenvy #trendy#transformation #goodhealth #lovingit#Green#GlamourSlam pic.twitter.com/EypIRH9Ovu
— KhushbuSundar (@khushsundar) April 15, 2025
Also Read..
Vijayashanthi | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. సీరియస్ అయిన విజయశాంతి
Abhinaya | ఈ అందాల నటి పెళ్లి వేడుకలు షూరూ… కాబోయే భర్తతో క్యూట్ పోజులు
Kingdom | కింగ్డమ్పై అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ కంప్లీట్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

