Abhinaya | మాట, వినికిడి శక్తి లేకపోయిన తన టాలెంట్‌తో మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది నటి అభినయ. తమిళనాడుకు చెందిన ఈమె తెలుగులో కూడా చాలా చిత్రాలు చేసింది. 2008లో తెలుగులో వచ్చిన ‘నేనింతే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఇందులో చిన్న పాత్రలో కనిపించి అలరించింది. ఆ తర్వాత కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజుగారి గది 2, సీతా రామం, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో తన నటనతో ఎంతగానో మెప్పించింది. తమిళంలో ఆమె నటించిన ‘నాడోడిగల్’ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకుంది.
15 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న అభినయ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు భాషలలో చిత్రాలు చేసింది. ఇక ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్న అభినయ.. తాజాగా తన పెళ్లి వేడుకలకి సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కార్తీక్ అనే వ్యక్తిని అభినయ పెళ్లి చేసుకోనుండగా, అతనితో కలిసి మెహందీ వేడుకలో దిగిన క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు టాక్.
నటి అభినయ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి హైదరాబాద్ వాసి కాగా, అతనికి పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయముందని, అప్పటి నుండే ఇద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. ఎట్టకేలకి ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా, హైదరాబాద్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో వీరి నిశ్చితార్థపు వేడుక అతి సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి కూడా హైదరాబాద్‌లోనే జరుగుతున్న నేపథ్యంలో ఈ వేడుకకి ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది.