Kingdom | కింగ్డమ్పై అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ కంప్లీట్!
Kingdom | ‘ది ఫ్యామిలీ స్టార్' తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాలేదు. మధ్యలో ‘కల్కి 2898 ఏడీ’లో అర్జునుడిగా మెరిశారు విజయ్. సోలో హీరోగా ఆయన నటించే సినిమాకోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Kingdom | ‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాలేదు. మధ్యలో ‘కల్కి 2898 ఏడీ’లో అర్జునుడిగా మెరిశారు విజయ్. సోలో హీరోగా ఆయన నటించే సినిమాకోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ సినిమా చేస్తున్నారు విజయ్. ఈ సినిమా విడుదలపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు నెలకొని ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వారి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ తన ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టారు విజయ్ దేవరకొండ. ‘ప్రస్తుతం ‘కింగ్డమ్’ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేశా. గౌతమ్ ఓ వండర్ క్రియేట్ చేశాడు..’ అని ఆ పోస్ట్లో రాసుకొచ్చారు. డబ్బింగ్ థియేటర్లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, తాను చర్చించుకుంటున్న ఓ ఫొటోని కూడా ఈ స్టోరీతోపాటు ఆయన షేర్ చేశారు.
ఈ పోస్ట్ చూసి రౌడీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర వేరే లెవల్లో ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చెబుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవించందర్, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

