Yuzvendra Chahal | ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకుల అనంతరం రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash)తో టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం (dating rumours) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహ్వశ్తో రిలేషన్‌షిప్‌పై చాహల్ ఎట్టకేలకు నోరు విప్పారు. డేటింగ్ రూమర్స్‌కు చెక్‌పెట్టారు. మహ్వశ్తో డేటింగ్ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
రాజ్ షమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్వశ్తో లేదా మరెవరితోనైనా డేటింగ్లో ఉన్నారా అని చాహల్‌ను ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చారు. ‘లేదు. అలాంటిదేమీ లేదు. ప్రజలు ఏమి ఆలోచించాలనుకుంటున్నారో అది ఆలోచించుకోవచ్చు. నాకు మునుపటి బంధం నుంచి బయటపడటానికి కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ డేటింగ్ చేయట్లేదు’ అని స్పస్టం చేశారు. తాను ఎవరితోనైనా బయట కనిపిస్తే వారితో నాకు సంబంధం ఉందని మాట్లాడేసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు.
మహ్వశ్తో డిన్నర్‌కు వెళ్లినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై చాహల్ స్పందిస్తూ.. ‘క్రిస్మస్ సందర్భంగా ఐదుగురి ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లాం. అయితే కొందరు నేను, మహ్వశ్ మాత్రమే వెళ్లినట్లు ఫొటోను క్రాప్ చేసిన ప్రచారం చేశారు. దీనికారణంగా స్నేహితులతో కలిసి బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి’ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు మరికొన్ని ఘటనలపై కూడా చాహల్ స్పందించారు.
‘నేను విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉండగా.. తను నన్ను డ్రాప్ చేస్తానని చెప్పింది. దీంతో ఓ హోటల్ వద్ద కారు కోసం వేచి ఉన్నాం. ఆ సమయంలో ఎవరో వీడియో రికార్డ్ చేశారు. నేను నా జుట్టు సరిచేసుకుంటున్నా. దీంతో మేమిద్దరం హోటల్ గది నుంచి బయటకు వస్తున్నట్లుగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆ విషయం నన్ను చాలా బాధించింది’ అని చాహల్ వివరించారు.
మహ్వశ్తో చాహల్ ప్రేమాయణం..
ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో చాహల్ డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్వశ్తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది. ఈ ప్రచారానికి చాహల్ తాజాగా చెక్ పెట్టేశారు.
ధనశ్రీతో విడాకులు
దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్‌ను వివాహం చేసుకుంది. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్న ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 20న వీరికి విడాకులు మంజూరయ్యాయి. భరణం కింద చాహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించగా అందులో ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించినట్టు సమాచారం.
Also Read..
“RJ Mahvash | చాలా కేరింగ్ పర్సన్.. చాహల్‌పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పిన మహ్వశ్”
“RJ Mahvash | కోల్‌కతాతో మ్యాచ్‌లో విజృంభించిన చాహల్.. ఆర్జే మహ్వశ్ పోస్ట్ వైరల్”
“RJ Mahvash | చాహల్, ధనశ్రీ విడాకుల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్”