RJ Mahvash | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం ఆయన వ్యక్తిగత జీవితమే. భార్య ధనశ్రీ వర్మతో విడాకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash) డేటింగ్ వార్తలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. ఇప్పుడు మరోసారి తన పేరు మార్మోగిపోతోంది. ఐపీఎల్లో భాగంగా మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ చాహల్ అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తన స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లు తీసి పంజాబ్ జట్టును విజయతీరానికి చేర్చాడు. దీంతో చాహల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్జే మహ్వశ్ పెట్టిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాహల్‌తో దిగిన సెల్ఫీ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు చేస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. ‘మామూలు టాలెంట్ కాదిది.. అద్భుతమైన, అసాధారణ టాలెంటెడ్ మ్యాన్. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచావు. అసంభవ్’ అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కోల్‌కతాపై సంచలన విజయం.. చాహల్ మాయ
ఐపీఎల్లో భాగంగా ముల్లనూర్ వేదికా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. కొండంత స్కోర్ కొడుతుందనుకున్న పంజాబ్ 15.3 ఓవర్లకే కుప్పకూలగా.. హిట్టర్లతో నిండి కోల్‌కతా ఇన్నింగ్స్ 15.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. 112 పరుగుల ఛేదనలో యజ్వేంద్ర చాహల్(4-28) విజృంభించాడు. ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న చాహల్.. కీలక సమయంలో సత్తా చాటాడు. వరుస ఓవర్లలో అతడిచ్చిన షాకులకు కోల్‌కతాకు కుదేలైంది.
తన తొలి ఓవర్లోనే అతడు.. రహానేను వికెట్ల ముందు బలిగొని 55 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. మరుసటి ఓవర్లో రఘువంశీనీ ఔట్ చేసిన చాహల్.. 12వ ఓవర్లో ప్రమాదకర రింకూ సింగ్ (2)తో పాటు రమణ్దీప్నూ పెవిలియన్‌కు పంపడంతో వన్‌సైడ్ వార్ అనుకున్న మ్యాచ్ కాస్తా ఉత్కంఠగా మారింది. యాన్సెన్ కూడా 13వ ఓవర్లో హర్షిత్ (3)ను బౌల్డ్ చేయగా అర్ష్‌దీప్.. వైభవ్‌ను పెవిలియన్‌కు పంపడంతో కేకేఆర్ 9వ వికెట్ కోల్పోయింది. యాన్సెన్.. 16వ ఓవర్లో తొలి బంతికి రస్సెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
మహ్వశ్తో చాహల్ ప్రేమాయణం..
ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో చాహల్ డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్వశ్తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది.
Also Read..
కింగ్స్ కమాల్.. కోల్‌కతాపై సంచలన విజయం..
Zaheer Khan | తండ్రైన మరో క్రికెటర్.. మగబిడ్డకు జన్మనిచ్చిన సాగరిక ఘాట్గే
Los Angels Olympics: 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. క్రికెట్ వేదికను ప్రకటించిన ఐసీసీ