RJ Mahvash | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash) డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్వశ్తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది. ఇక తమ బంధంపై చాహల్ కానీ, మహ్ వశ్ కానీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహ్వశ్.. చాహల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంటర్వ్యూలో భాగంగా ‘చాహల్లో ఏ లక్షణం మీకు బాగా నచ్చింది..?’ అంటూ మహ్వశ్ను విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. చాహల్ చాలా మంచివాడని, వినయపూర్వకంగా ఉంటాడని జవాబిచ్చింది. ‘చాహల్ చాలా మంచివాడు. ఎంతో వినయం కలిగిన వ్యక్తి. చాలా కేరింగ్ పర్సన్. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రేమించిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. అతనిలో ఉన్న ఆ లక్షణాన్ని నేను కూడా అందిపుచ్చుకోవాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. మహ్వశ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య బంధం గురించి మరోసారి చర్చ మొదలైంది.
Also Read..
“RJ Mahvash | కోల్‌కతాతో మ్యాచ్‌లో విజృంభించిన చాహల్.. ఆర్జే మహ్వశ్ పోస్ట్ వైరల్”
“RJ Mahvash | చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. రిలేషన్షిప్ స్టేటస్ గురించి చెప్పిన ఆర్జే మహ్వశ్”
“RJ Mahvash | అతనే నా భర్త.. నా జీవితం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది : మహ్వశ్ ఆసక్తికర పోస్ట్”