RJ Mahvash | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) జంట తమ వివాహ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. గత నెల వీరికి ముంబై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పుతో ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వాళ్లు ముందుకు వెళ్తున్నారు. అయితే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash)తో చాహల్ డేటింగ్లో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహ్వశ్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హస్బెండ్’ వీడియో పోస్టు (Husband Post) చేశారు. ఆ వీడియోకి చాహల్ లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఆ వీడియోలో మహ్వశ్ హిందీలో మాట్లాడుతూ.. ‘నా జీవితంలోకి ఏ అబ్బాయి వస్తాడో.. అతనే నా జీవితంలో ఏకైక వ్యక్తి అవుతాడు. అతనే నాకు స్నేహితుడు. అతనే నా ప్రియుడు. అతనే నా భర్త. నా జీవితం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో నేను ఇతర అబ్బాయిలతో కూడా మాట్లాడలేను’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ఆకర్షిస్తోంది. మహ్వశ్ షేర్ చేసిన ఈ రీల్ వీడియోని చాహల్ లైక్ చేశాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో చాహల్ డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్వశ్తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది.
Also Read..
“RJ Mahvash | చాహల్, ధనశ్రీ విడాకుల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్”
“Dhanashree Verma | మహిళలను నిందించడం ఫ్యాషనైపోయింది.. ధనశ్రీవర్మ పోస్ట్ వైరల్”
“RJ Mahvash | యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన ఆర్జే మహ్వాష్”