Dhanashree Verma | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ విడాకులు కూడా మంజూరైనట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చాహల్ ఓ అమ్మాయితో కలిసి వీక్షించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
దుబాయ్ వేదికగా ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash)తో కలిసి చాహల్ వీక్షించారు. స్టేడియంలో ఇద్దరూ ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీవర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విడాకుల వార్తల విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఆమె ఇలా స్పందించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చాహల్.. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది.
ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికీ విడాకులు మంజూరైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. ధనశ్రీ-చాహల్ జంట ఇటీవలే కోర్టుకు హాజరైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఈ ఇద్దరికి 45నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జీ విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నట్లు నివేదించింది. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుపడంతో జడ్జీ విడాకులకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఇక ఇదే సమయంలో చాహల్, ధనశ్రీ తమ సోషల్‌మీడియా అకౌంట్లలో తమదైన శైలిలో పోస్టులు పెట్టడం కూడా ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లైంది.
Also Read..
Team India | స్పిన్నర్లే విన్నర్లు.. స్పిన్ ఉచ్చులో ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి
PCB | వేదికపై మమ్మల్నెందుకు పిలువలేదు?.. ఐసీసీపై పీసీబీ ఆగ్రహం