RJ Mahvash | టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చహల్ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ క్రికెటర్ ఓ ఆర్జే ప్రేమలో మునిగితేలుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆర్జే మహ్వాష్తో పార్టీ చేసుకుంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి. దాంతో ఇద్దరు డేటింగ్లో ఉన్నారనే వార్త వైరల్‌గా మారింది. అయితే, చహల్‌తో డేటింగ్ వార్తలపై ఆర్జే మహ్వాష్ స్పందించింది. డేటింగ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్టోరీ పెట్టింది. కొన్ని కథనాలు, ఊహాగానాలు ఇంటర్నెట్లో వ్యాపిస్తున్నాయని.. ఊహాజనిత వార్తలను చూడడం ఫన్నీగా ఉందని పేర్కొంది. ఇద్దరు కలిసి కనిపిస్తే డేటింగ్ చేస్తున్నట్లేనా..? ప్రస్తుతం మనమంతా ఏ సంవత్సరంలో ఉన్నామంటూ ప్రశ్నించింది. ఓ అమ్మాయి, అబ్బాయి కనిపిస్తే డేటింగ్ ఊహాగానాలు ఎందుకు దారి తీస్తున్నాయని.. మీరంతా ఎందరితో డేటింగ్ చేస్తున్నారంటూ నిలదీసింది.
గత రెండు మూడు రోజులుగా తాను ఓపికతో ఉన్నారని.. తనను అనవసరంగా బ్లేమ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. కష్టాల్లో ఉన్నవారు వారి కుటుంబం, స్నేహితులతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనివ్వాలంటూ మహ్వాష్ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ జంట ఇటీవల ఇన్స్టాగ్రామ్ నుంచి ఇద్దరి ఫొటోలను తొలగించారు. ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు విడిపోతున్నట్లుగా ప్రచారం జరిగింది. విడాకులపై చహల్ స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందని.. అయితే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చునని.. ఇలాంటి ఊహానాలను పట్టించుకోవద్దని.. అభిమానులకు ఇదే నా రిక్వెస్ట్ అంటూ పోస్ట్ పెట్టాడు. అంతకు ముందు ధనశ్రీ సైతం స్పందించింది. విడాకులపై వస్తున్న వార్తలతో తాను మానసిక వేదనకు గురవుతున్నారని.. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వాపోయింది.
Rj