RJ Mahvash | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) వివాహ బంధానికి తెరపడ్డట్టే. వీరు గత నెల విడాకుల కోసం మంజూరు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో నేడు ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘అబద్ధాలు, దురాశ, మోసానికి దూరంగా ఉంచిన దేవుడికి ధన్యవాదాలు.. ఇవాళ అద్దం ముందు ధైర్యంగా నిల్చోగలుగుతున్నా’ అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు లవ్ సింబల్స్‌తో ఉన్న డ్రెస్‌తో దిగిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో చాహల్ డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్వశ్తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తుంది.
ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు అంగీకరించిన చాహల్..!
చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి విడాకుల అంశానికి సంబంధించి కీలక విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో నేడు తుది తీర్పు వెలువడనున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2022 నుంచే ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారట. పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించగా అందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. దీనిని సవాల్ చేస్తూ చాహల్ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా అందుకు న్యాయస్థానం పిటీషన్‌దారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2022 నుంచే విడివిడిగా ఉంటున్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు మార్చి 20 లోపు విడాకుల అంశంపై తుది తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్‌ను పెండ్లి చేసుకున్నారు.
Also Read..
“Yuzvendra Chahal | చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్”
“Dhanashree Verma | మహిళలను నిందించడం ఫ్యాషనైపోయింది.. ధనశ్రీవర్మ పోస్ట్ వైరల్”