RJ Mahvash | చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. రిలేషన్షిప్ స్టేటస్ గురించి చెప్పిన ఆర్జే మహ్వశ్
RJ Mahvash | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash) డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
RJ Mahvash | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్వశ్ (RJ Mahvash) డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాహల్‌తో డేటింగ్ రూమర్స్‌పై మహ్వశ్ మౌనం వీడారు. తన రిలేషన్షిప్ స్టేటస్ (Relationship Status) గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్లో లేనని.. సింగిల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు.
అంతేకాదు తాను క్యాజువల్ డేటింగ్ను నమ్మనని మహ్వశ్ పేర్కొన్నారు. గతంలో ఓ వ్యక్తితో తనకు నిశ్చితార్థం జరిగిందని.. ఆ బంధం తెగిపోయిందని చెప్పుకొచ్చారు. ‘నేను ప్రస్తుతం ఒంటరిగా.. చాలా సంతోషంగా ఉన్నాను. నేటి కాలంలో నాకు పెళ్లి అనే భావన పూర్తిగా అర్థం కాలేదు. నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే డేటింగ్‌కి వెళ్తా. అదికూడా క్యాజువల్ డేటింగ్‌కు కాదు. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తితో మాత్రమే డేటింగ్ చేస్తా’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహ్వశ్ కామెంట్ వైరల్ అవుతోంది.
కాగా, రెండు రోజుల క్రితం మహ్వశ్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హస్బెండ్’ వీడియో పోస్టు (Husband Post) చేశారు. ఆ వీడియోలో మహ్వశ్ హిందీలో మాట్లాడుతూ.. ‘నా జీవితంలోకి ఏ అబ్బాయి వస్తాడో.. అతనే నా జీవితంలో ఏకైక వ్యక్తి అవుతాడు. అతనే నాకు స్నేహితుడు. అతనే నా ప్రియుడు. అతనే నా భర్త. నా జీవితం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో నేను ఇతర అబ్బాయిలతో కూడా మాట్లాడలేను’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ఆకర్షిస్తోంది. మహ్వశ్ షేర్ చేసిన ఈ రీల్ వీడియోని చాహల్ లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో చాహల్ డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్వశ్తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది.
Also Read..
“RJ Mahvash | అతనే నా భర్త.. నా జీవితం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది : మహ్వశ్ ఆసక్తికర పోస్ట్”
“RJ Mahvash | చాహల్, ధనశ్రీ విడాకుల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్”
“Dhanashree Verma | మహిళలను నిందించడం ఫ్యాషనైపోయింది.. ధనశ్రీవర్మ పోస్ట్ వైరల్”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

