Dhanashree Verma | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం వీరిద్దరికీ విడాకులు కూడా మంజూరైనట్లు మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలపై ధనశ్రీ లాయర్ (Dhanashree lawyer) అదితి మోహన్ (Aditi Mohan) తాజాగా స్పందించారు. అలాంటి వార్తలను కొట్టిపారేశారు.
విడాకుల అంశం ప్రస్తుతం సబ్ జ్యుడీస్‌లో ఉందని పేర్కొన్నారు. వార్తలు రాసే ముందు పత్రికలు వాస్తవాన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు. చాలా తప్పుదారి పట్టించే సమాచారం ప్రసారం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ధనశ్రీకి భరణం కింద రూ.60 కోట్లు అంటూ వస్తున్న వార్తలపై కూడా లాయర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్లైంట్ కుటుంబం ఎలాంటి భరణం డిమాండ్ చేయలేదని, అటువైపు నుంచి కూడా ఎలాంటి భరణం ఆఫర్ చేయలేదని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్యాలను ప్రచురించడం బాధ్యతారాహిత్యం అని వ్యాఖ్యానించారు. వార్తలను ప్రచురించే ముందు ఒక్కసారి వాస్తవాన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరి గోప్యతను గౌరవించండి అంటూ పేర్కొన్నారు.
చాహల్.. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది.
ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికీ విడాకులు మంజూరైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. ధనశ్రీ-చాహల్ జంట గురువారం కోర్టుకు హాజరైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఈ ఇద్దరికి 45నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జీ విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నట్లు నివేదించింది. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుపడంతో జడ్జీ విడాకులకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఇక ఇదే సమయంలో చాహల్, ధనశ్రీ తమ సోషల్‌మీడియా అకౌంట్లలో తమదైన శైలిలో పోస్టులు పెట్టడం కూడా ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లైంది.
‘మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి. ఆయనపై మీకున్న విశ్వాసమే అంతా మంచి జరిగేలా చేస్తుంది’ అంటూ ధనశ్రీ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. ‘ఒత్తిడి నుంచి ఆశీర్వాదం’ వరకూ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
అంతకుముందు చాహల్ కూడా దేవుడికి కృతజ్ఞతలు అంటూ ఓ పోస్టు పెట్టారు. ఆ దేవుడు తనని లెక్కలేనన్ని సార్లు రక్షించాడని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని గుర్తించేలోపే భగవంతుడు దాన్నుంచి బయటపడేశాడని గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ తనకు రక్షణగా ఉన్న ఆ దేవుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే, ఇద్దరూ తమ పోస్ట్‌లో విడాకుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.
Also Read..
“Yuzvendra Chahal | అంతా ఊహించినట్లే.. చాహల్, ధనశ్రీ విడాకులు”
“RJ Mahvash | యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన ఆర్జే మహ్వాష్”
“కావచ్చు.. కాకపోవచ్చు.. విడాకులపై స్పందించిన చాహల్”
“Yuzvendra Chahal | నిజం ఎప్పటికైనా గెలుస్తుంది.. విడాకుల రూమర్స్‌పై స్పందించిన ధనశ్రీ వర్మ”
“Yuzvendra Chahal | మరో స్టార్ జంట విడాకులు..? ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో..!”