Yuzvendra Chahal | ముంబై: అంతా ఊహించినట్లే జరిగింది. గత కొన్ని నెలలుగా టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, ధనశ్రీ దంపతులు విడిపోతున్నారన్న వార్తలు నిజమయ్యాయి. గురువారం ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరైన చాహల్, ధనశ్రీకి జడ్జీ విడాకులు మంజూరు చేశారు.
తొలుత ఈ ఇద్దరికి 45నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జీ విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుపడంతో జడ్జీ విడాకులకు ఆమోదం తెలిపాడు. దీనిపై చాహల్, ధనశ్రీ తమ సోషల్మీడియా అకౌంట్లలో తమదైన శైలిలో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే భరణంగా ధనశ్రీకి చాహల్ 60 కోట్లు ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.