Yuzvendra Chahal | భారత స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) – ధనశ్రీ వర్మ (Dhanashree Verma) జంట విడాకులు తీసుకోబోతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోయేందుకు నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విడాకుల రూమర్స్‌పై చాహల్ భార్య ధనశ్రీ మౌనం వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టు పెట్టారు. కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తలతో తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
‘గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తలను చూస్తుంటే నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. నిజాలు తెలుసుకోకుండా నిరాధారమైన రాతలు రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఈ విషయం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. జీవితంలో ఎదగడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. విలువలకు కట్టుబడి వాస్తవం పై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాను. నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అని ధనశ్రీ వర్మ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
చాహల్.. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది.
Chahal2
Also Read..
“Yuzvendra Chahal | మరో స్టార్ జంట విడాకులు..? ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో..!”
“Dhanashree Verma | టాలీవుడ్ సినిమా చేయబోతున్న స్టార్ క్రికెటర్ భార్య.?”
“Yuzvendra Chahal | పంజాబీ పాటకు స్టెప్పులేసిన చాహల్ జంట.. వీడియో వైరల్”