Dhanashree Verma | భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.
ఇక కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. అదికాస్తా ప్రేమగా మారింది. డిసెంబర్ 2020లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే చాహల్ క్రికెట్లో రాణిస్తుండగా.. ధనశ్రీ సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా పనిచేస్తుంది. అయితే ఈ భామకి టాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ భామ తెలుగులో ఒక సినిమాకు ఒకే చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అన్ని వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Dhanashree Verma