Yuzvendra Chahal | పంజాబీ పాటకు స్టెప్పులేసిన చాహల్ జంట.. వీడియో వైరల్
టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అయిన చాహల్ ఈమధ్య మైదానంలో కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఈ లెగ్ స్పిన్నర్ తాజాగా భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో కలిసి మూడో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకున్నాడు. ఈ సందర్బంగా ఇద్దరూ కలిసి పంజాబీ పాటకు...
Yuzvendra Chahal : భారత స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) వరల్డ్ కప్ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఒక్క వన్డే కూడా ఆడలేకపోయాడు. అనుభవం, ప్రతిభకు కొదవలేకపోయినా కోచ్, కెప్టెన్ అతడిని పక్కన పెట్టేస్తున్నారు. టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అయిన చాహల్ ఈమధ్య మైదానంలో కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు.
ఈ లెగ్ స్పిన్నర్ తాజాగా భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో కలిసి మూడో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకున్నాడు. ఈ సందర్బంగా ఇద్దరూ కలిసి పంజాబీ పాటకు హుషారుగా స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మూడో పెండ్లి రోజును పునస్కరించుకొని చాహల్, ధనశ్రీ ‘గల్ బన్ గయే'(Gal Ban Gayee) అనే పంజాబీ పాటుకు డాన్స్ చేశారు. ఆ వీడియోను ధనశ్రీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దానికి.. ‘మూడేండ్లుగా ఒకరికొకరం ప్రతీ సందర్భంలో ఎంతో సపోర్ట్‌గా ఉంటున్నాం. అవకాశం వచ్చిన ప్రతిసారి చాహల్‌తో ఈరోజు మాదిరిగానే డాన్స్ చేస్తాను. హ్యాపీ యానివర్సరీ’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. చాహల్, దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది వెస్టిండీస్ పర్యటనలో ఆకట్టుకున్న చాహల్‌కు వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్‌లో మాత్రం చోటుదక్కలేదు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న చైనామన్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav).. చాహల్ బదులు మెగా టోర్నీ బృందంలో చాన్స్ కొట్టేశాడు. ఇప్పటివరకూ 72 వన్డేలు ఆడిన చాహల్ 121 వికెట్లు తీశాడు. ఇక టీ20లో ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడైన చాహల్ 96 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి
- Bhupalapally | రాజకీయం నాపై చేయండి …ఆలయంపై కాదు : గండ్ర వెంకటరమణారెడ్డి.
- Christmas Dinner: క్రిస్మస్ డిన్నర్ ఇచ్చిన విమాన సంస్థ.. 700 మంది సిబ్బందికి అస్వస్థత
- Medak | మెదక్‌లో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వేడుకలు
- Dunki Movie | ప్రభాస్ ‘ఆదిపురుష్’ కంటే తక్కువ.. దారుణంగా పడిపోయిన షారుఖ్ ‘డంకీ’ కలెక్షన్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

