బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 03:19:35

బీబీఎల్‌లో యువరాజ్‌!

బీబీఎల్‌లో యువరాజ్‌!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రముఖ టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఆడాలని టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ భావిస్తున్నాడు. గతేడాది కెనడా టీ20, టీ10 లీగ్‌ల్లో ఆడిన యువీ బీబీఎల్‌ల్లోనూ అడుగుపెట్టాలని కోరుకుంటున్నాడు. కాగా అతడి కోసం ఓ ఫ్రాంచైజీని అన్వేషించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఇప్పటికే కసరత్తులు చేస్తున్నదని సమాచారం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ వెల్లడించింది. అన్ని అంశాలు కలిసి వచ్చి బీబీఎల్‌లో యువీ ఆడితే.. ఆ టోర్నీలో బరిలోకి దిగే తొలి భారత ఆటగాడు అతడే అవుతాడు. 


logo