South Africa : బంగ్లాదేశ్ పర్యటనకు సిద్దమవుతున్న దక్షిణాఫ్రికాకు పెద్ద షాక్. సిరీస్ ఆరంభ పోరుకు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) అందుబాటులో ఉండడం లేదు. ఎడమ చేతి కండరాల నొప్పి కారణంగా బవుమా తొలి టెస్టుకు దూరం కానున్నాడు. అందుకని మిర్పూర్(Mirpur)లో జరిగే మొదటి టెస్టుకు ఎడెన్ మర్క్రమ్ (Aiden Markarm) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
బవుమా బ్యాకప్‌గా యువకెరటం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis)ను సెలెక్టర్లు స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. సఫారీ జెర్సీతో రెండంటే రెండు టీ20లే ఆడిన బ్రెవిస్ మిర్పూర్లో టెస్టు అరంగేట్రం చేసే అవకాశముంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిన సఫారీ జట్టు.. అనంతరం వన్డేల్లో ఐర్లాండ్‌పై కూడా చిత్తుగా ఓడింది. ఇప్పుడు టెస్టు సిరీస్ ఆ జట్టుకు ఓ చాలెంజ్ కానుంది. బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది.
South Africa will be without captain Temba Bavuma for the first Test against Bangladesh in Dhaka ❌
Aiden Markram will lead them in his absence; Dewald Brevis and Lungi Ngidi have been added to the squad
👉 https://t.co/95CIzjwKm6 pic.twitter.com/wwz98nGaqD
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2024
ఇరజట్ల మధ్య అక్టోబర్ 21న మిర్పూర్లో తొలి మ్యాచ్.. ఛత్రోగ్రామ్లో అక్టోబర్ 29న రెండో టెస్టు జరుగనున్నాయి. ఇక.. కెప్టెన్ బవుమా తరచూ గాయపడుతుండడం సఫారీ జట్టును కలవరపరుస్తోంది. సెప్టెంబర్‌లో అఫ్గనిస్థాన్‌తో తొలి వన్డేకు ముందు అనారోగ్యం పాలైన బవుమా.. ఇప్పుడు బంగ్లా సిరీస్ ముందు కూడా అనుకోకుండా గాయపడ్డాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బ్రెవిస్ 68.58 స్ట్రయిక్ రేటుతో 749 పరుగుల చేశాడు. అందులో రెండు సెంచరీలు, నాలు అర్ధ శతకాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, మాథ్యూ బ్రీట్జ్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, ఎడెన్ మర్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ మల్డర్, సునురన్ ముతుసామి, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటెర్సన్, డేన్ పీడిట్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, రియాన్ రికెల్టన్, కైలీ వెర్నెన్నే.