హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరోమారు సత్తాచాటాడు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న యశ్వంత్ తాజాగా మణిపూర్‌లో అత్యంత ఎత్తయిన మౌంట్ ఐసోను ఎక్కాడు. ‘హర్ శిఖర్ పర్ తిరంగ’ మిషన్‌లో భాగంగా యశ్వంత్ ఆదివారం మౌంట్ ఐసో పైకి త్రివర్ణ పతాకంతో చేరుకున్నాడు.
యశ్వంత్‌తో పాటు అసోం రైఫిల్స్ 16వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు మిలటరీ అధికారులు ఈ పర్వతాన్ని అధిరోహించారు. గతంలో కిలీమంజారో, మౌంట్ ఎల్బ్రస్ పర్వతాలపై యశ్వంత్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.