హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ ఆటగాడు అరవెల్లి అవనీశ్ (60 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో.. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు గెలిచింది. మొదట దక్షిణాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసింది.
అనంతరం భారత అండర్-19 జట్టు40.5 ఓవర్లలో 3 వికెట్లకు 244 పరుగులు చేసింది. అవనీశ్తో పాటు ఆర్షిన్ కులకర్ణి (91), ఆదర్శ్ సింగ్ (66) హాఫ్సెంచరీలు చేశారు.