ఢిల్లీ: ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. రొమానియాలో జరుగుతున్న ఈ టోర్నీ అండర్-19 విభాగం సెమీస్‌లో అంకుర్ భట్టాచర్జీ, ప్రియాంజు భట్టాచార్య, అభినంద్తో కూడిన భారత త్రయం.. 3-2తో చైనీస్ తైపీకి షాకిచ్చింది.
ఫైనల్లో భారత అబ్బాయిలు.. జపాన్ షట్లర్లతో తలపడనున్నారు.