ఒర్లీన్స్: సీనియర్లందరూ విఫలమైనా ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన యువ భారత షట్లర్ ఆయూష్ శెట్టి అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు సెమీస్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో ఆయూశ్ 21-16, 21-23, 21-17తో రస్మస్ (డెన్మార్క్)పై సత్తా చాటాడు.
తనకంటే మెరుగైన, ప్రపంచ పదో ర్యాంకర్ అయిన రస్మస్పై అయూశ్ హోరాహోరీగా పోరాడి విజయాన్ని అందుకున్నాడు.