జిన్జియాంగ్ (చైనా) : భారత యువ బాక్సర్లు పతకాల పంట పండించారు. చైనాలో జరిగిన ‘బెల్ట్ అండ్ రోడ్’ ఇంటర్నేషనల్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా 7 స్వర్ణాలు, మరో 7 రజతాలు, 12 కాంస్యాల (మొత్తంగా 26)తో సత్తా చాటారు. మహిళల విభాగంలో ఐదేసి పసిడి, రజత పతకాలు నెగ్గిన భారత్.. 6 కాంస్యాలను గెలుచుకుంది.
అబ్బాయిల క్యాటగిరీలో రెండేసి గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో పాటు 6 కాంస్య పతకాలను నెగ్గింది. మహిళల క్యాటగిరీలో లక్ష్మీ (46 కిలోలు), రాధామణి (60 కి.), హర్నూర్ (66 కి.), జ్యోతి (75 కి.), అన్షిక (80 కి.) స్వర్ణ కాంతులు పంచారు. అబ్బాయిల్లో ఫలక్ (48 కి.), ఉధమ్ సింగ్ (54) గోల్డ్ కొట్టారు.