షాంఘై: భారత యువ ఆర్చర్ సాహిల్ జాదవ్ ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2లో సత్తాచాటాడు. తన కెరీర్లో రెండో వరల్డ్ కప్ ఆడుతున్న ఈ మహారాష్ట్ర కుర్రాడు.. మెన్స్ కాంపౌండ్ విభాగంలో కాంస్యంతో మెరిశాడు. శనివారం జరిగిన కాంస్య పోరులో సాహిల్.. 147-144తో డెన్మార్క్‌కు చెందిన వెటరన్ ఆర్చర్ మార్టిన్ డమ్స్బొపై గెలిచి తొలి ప్రపంచకప్ పతకాన్ని ముద్దాడాడు.
అంతకుముందు సెమీస్‌లో సాహిల్ 146-147తో ఫ్రాన్స్ ఆర్చర్ అయిన ప్రపంచ మూడో ర్యాంకర్ నికోలస్ గిరాడ్ చేతిలో ఓటమి పాలవడంతో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.