Rachin Ravindra | మౌంట్ మాంగనీ: యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర (240; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న పోరులో కివీస్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగులు చేసింది.
రచిన్ డబుల్ సెంచరీ చేయగా.. కేన్ విలియమ్సన్ (118) శతక్కొట్టాడు. సఫారీ బౌలర్లలో నీల్ బ్రాండ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా సోమవారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు.. ప్రత్యర్థి స్కోరుకు 431 పరుగులు వెనుకబడి ఉంది.