IND vs WI : తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. టాపార్డర్ బ్యాటర్లు దంచేయగా మొదటి రోజే మూడొందలు కొట్టింది టీమిండియా. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్(173 నాటౌట్)దూకుడే మంత్రగా చెలరేగి సెంచరీతో గర్జించాడు. మూడో స్థానంలో పాతుకుపోవాలనుకుంటున్న సాయి సుదర్శన్ (87) అర్ధ శతకంతో తడాఖా చూపించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. వీరిద్దరి జోరుకు ఆఖర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(20 నాటౌట్) సమయోచిత బ్యాటింగ్ తోడవ్వగా భారత్ తొలి రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భారత జట్టు జోరు చూపిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్ భరతం పడుతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో విండీస్‌ను మట్టికరిపించిన భారత్ రెండో టెస్టులోనూ డ్రైవింగ్ సీట్లో ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (173 నాటౌట్: 253 బంతుల్లో 22 ఫోర్లు),సాయి సుదర్శన్(87) దంచికొట్టారు.కరీబియన్ జట్టుపైనే తొలి టెస్టు శతకం బాదిన యశస్వీ.. తనకు ఇష్టమైన ప్రత్యర్థిపనై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విండీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సుదర్శన్‌తో కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు.
📸📸
A 💯 to remember 😍
Rate Yashasvi Jaiswal’s innings so far 👇
Updates ▶ https://t.co/GYLslRyLf8#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/3LY101kuna
— BCCI (@BCCI) October 10, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్ (38) త్వరగానే ఔటైనా.. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ (87) క్రీజులో పాతుకుపోయాడు. వికెట్ బౌలింగ్‌కు సహకరించని పిచ్ మీద ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (173 నాటౌట్), అతడు పరుగుల పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే యశస్వీ తన కెరీర్లో ఏడో టెస్టు శతకం పూర్తి చేసుకున్నాడు.
అర్ధ శతకం తర్వాత 58 పరుగలు వద్ద వారికన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సుదర్శన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. టీ తర్వాత అతడు వారికన్ ఓవర్లో ఎల్బీగా ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్(20 నాటౌట్)తో యశస్వీ మరో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ అజేయంగా నిలవడంతో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి రన్స్ చేసింది.
That will be Stumps on Day 1️⃣
1️⃣7️⃣3️⃣*for Yashasvi Jaiswal 🫡
8️⃣7️⃣ for Sai Sudharsan 👏
3️⃣1️⃣8️⃣/2️⃣ for #TeamIndiaCaptain Shubman Gil and Yashasvi Jaiswal will resume proceedings on Day 2. 👍
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/neKB3PEM5J
— BCCI (@BCCI) October 10, 2025