Yashasvi Jaiswal : ఇంగ్లండ్ అంటే చాలు భారీ స్కోర్లతో రెచ్చిపోతుంటాడు యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal). నిరుడు స్వదేశంలో ఇప్పుడు వాళ్ల గడ్డపై ఈ కుర్రాడు ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టులో శతకంతో చెలరేగిన యశస్వీ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రహస్య సందేశమే తనను సూపర్ సెంచరీ కొట్టేలా చేసిందని చెప్పాడీ డాషింగ్ బ్యాటర్.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించిన ఓవల్ టెస్టులో యశస్వీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపు శతకంతో జట్టును ఆదుకున్న అతడు.. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ తనకు చెప్పిన సందేశం గురించి వెల్లడించాడు. ‘ఓవల్ వికెట్‌పై బ్యాటింగ్ కష్టంగానే తోచింది. కొన్నిసార్లు బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యేది. ఆ సమయంలో రోహిత్ భాయ్‌ను గ్యాలరీలో ఉండడం చూశాను. అతడు నాకు ఒక మెసేజ్ పంపాడు. ‘ఏం కంగారు పడకు. సాధ్యమైనంత వరకూ ఆడుతూ ఉండు’ అని ఆ మెసేజ్ సారాంశం. హిట్‌మ్యాన్ పంపిన ఆ సందేశం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింద’ని యశస్వీ తెలిపాడు. మూడోరోజు తాను సానుకూల దృక్ఫథంతో క్రీజులోకి వచ్చానని చెప్పిన ఈ యంగ్‌స్టర్ ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో విజయవంతం అయ్యానని వివరించాడు.
𝙔𝙖𝙨𝙝𝙖𝙨𝙫𝙞 𝙅𝙖𝙞𝙨𝙬𝙖𝙡 🫶
Hundred in the first innings of the series 👌
Hundred (and going strong) in the last innings of the series 💪
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/hJswO7a4Kt
— BCCI (@BCCI) August 2, 2025
‘ఓవల్‌లో ఇదే చివరి ఇన్నింగ్స్ అని నాకు తెలుసు. అందుకే.. క్రీజులో కుదురుకొని.. రన్స్ రాబట్టాలని మానసికంగా సిద్ధమయ్యాను. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ చూశాక.. ఈ పిచ్‌పై ఎలా ఆడాలని అనేది అర్థమైంది. పాజిటివ్‌గా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలనుకున్నా. ఆకాశ్ దీప్..చాలా గొప్పగా ఆడాడు. సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినుందకు చాలా సంతోషంగా ఉంది’ అని యశస్వీ అన్నాడు.
2⃣-2⃣ 🏆
The first ever Anderson-Tendulkar Trophy ends in a draw 🤝#TeamIndia | #ENGvIND pic.twitter.com/9dY6LoFOjG
— BCCI (@BCCI) August 4, 2025
ఓవల్‌లో ఐదో రోజు చిరస్మరణీయ విజయంతో సిరీస్ సమం చేసింది టీమిండియా. నైట్‌వాచ్‌మన్ ఆకాశ్ దీప్(66)తో నాలుగో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వీ ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీశాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ధనాధన్ ఆడి హాఫ్ సెంచరీ బాదడంతో గిల్ సేన పోరాడగలిగే స్కోర్ చేసింది. 374 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు హ్యారీ బ్రూక్, జో రూట్ల సెంచరీలతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. కానీ, ఐదో రోజు సిరాజ్ విజృంభణతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. అంతే.. అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ.. చరిత్రాత్మక విజయంతో సిరీస్‌ను సమం చేసింది గిల్ సేన.