IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు నిలబడతారనుకుంటే అదే తడబ్యాటు కొనసాగించారు. క్రిస్ వోక్స్(2-0) వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0), సాయి సుదర్శన్(0)లు డకౌట్‌గా వెనుదిరిగారు. హ్యాట్రిక్ బంతిని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అడ్డుకోవడంతో డగౌట్‌లోని భారత బృందం ఊపిరిపీల్చుకుంది. ఖాతా తెరవకుండానే కీలక వికెట్లు పడడంతో జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత కేఎల్ రాహుల్(1), గిల్ మీద పడింది. మరి.. ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను కాచుకొని పోరాడతారా? అనేది చూడాలి.
ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసిన అదే పిచ్ మీద భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు శుభారంభం ఇస్తారనుకుంటే సీన్ రివర్సైంది. వోక్స్ కొత్త బంతితో ఇబ్బంది పెట్టగా యశస్వీ జైస్వాల్() ఫస్ట్ స్లిప్‌లో రూట్ చేతికి దొరికాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్() మొదటి బంతినే స్లిప్‌లో ఆడి బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతే.. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోగా.. భారత డగౌట్‌లోని కోచ్ గంభీర్, ఇతరులు ఇదేంటీ? అన్నట్టు ఆశ్చర్యపోయారు. లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి ఒకే రన్ చేసిన భారత్ ఇంకా 310 పరుగులు వెనకబడి ఉంది.
Utter Woakes Nonsense. 🤯
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/2QnPbW3Diw
— Emirates Old Trafford (@EmiratesOT) July 26, 2025
తొలి ఇన్నింగ్స్‌లో బజ బాల్ ఆటతో ఇంగ్లండ్ బ్యాటర్లు కదం తొక్కగా.. భారీ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్నజో రూట్(150) దిగ్గజాల రికార్డును బ్రేక్ చేస్తూ శతకం సాధించాడు. అతడి సూపర్ సెంచరీతో డీలా పడిన గిల్ సేనకు బెన్ స్టోక్స్ (141) రికార్డు శతకంతో కొండంత స్కోర్ అందించాడు. టెయిలెండర్ బ్రైడన్ కార్సే(47) సైతం ధనాధన్ ఆడగా 669 రన్స్ కొట్టిన ఆతిథ్య జట్టు… ఏకంగా 311 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టుబిగించింది.