Jewellery Shop | బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు సాయుధులు బంగారం దుకాణం (Jewellery Shop)లోకి చొరబడి షాప్‌ను లూటీ చేశారు. దుకాణం యజమానిని గన్‌తో బెదిరించి రూ.లక్షల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో మాదనాయకనహళ్లి ప్రాంతంలోని రామ్ జ్యువెలర్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. యజమాని కన్హయ్య లాల్ షాప్‌ను క్లోజ్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడ్డారు. వారిలో ఒకరు తుపాకీ (gunpoint) తీసి కన్హయ్య లాల్, సిబ్బందిని బెదిరించారు. అనంతరం దుకాణంలోని బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. దాదాపు 185 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు యజమాని తెలిపారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.18 లక్షలని పేర్కొన్నారు. చోరీ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడు కన్హయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
#Watch: Three Men Rob Bengaluru Jewlery Shop at Gunpoint, Escape Caught on Camera
.
.
. pic.twitter.com/yUOImORhdQ— Republic (@republic) July 26, 2025
Also Read..
Kedarnath Yatra | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
Google Maps | మళ్లీ ముంచిన గూగుల్ మ్యాప్స్.. నీటి గుంటలోకి దూసుకెళ్లిన కారు