Chirag Paswan | బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఎన్డీయే మిత్రపక్షమైన నితీశ్ కుమార్ (Nitish Kumar) పాలనపై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. నేరాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఈ మేరకు అధికారంలోని నితీశ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
అంబులెన్స్‌లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన పాశ్వాన్ పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నేరాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. ప్రజలను రక్షించే స్థితిలో ప్రభుత్వం లేదని.. అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు చింతిస్తున్నట్లు ఈ సందర్భంగా పాశ్వాన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read..
Kedarnath Yatra | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
Google Maps | మళ్లీ ముంచిన గూగుల్ మ్యాప్స్.. నీటి గుంటలోకి దూసుకెళ్లిన కారు
Bomb Threat | టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చాం.. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వరుస బాంబు బెదిరింపులు