Asia Cup | భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ప్లేయర్స్ అంతా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఇకపై భారత జట్టు ఆసియా కప్‌కు సన్నద్ధం కానున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలు కానున్నది. ఈ సారి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఆసియా కప్ జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీకి పెద్ద సవాల్‌గా మారింది. టీ20 జట్టు ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల మూడోవారం వరకు ఆసియా కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటిస్తుందని భావిస్తున్నారు. జట్టులో చోటు కోసం యశస్వి జైస్వాల్, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ పోటీలో ఉన్నారు.
సెప్టెంబర్ 28న జరిగే టీ20 టోర్నీలోని ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తే.. కొద్దిరోజులకే వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో భారత్ వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చివరి సీజన్లో యశస్వి మంచి ఫామ్‌లో కనిపించాయి. 160 స్ట్రయిక్ రేట్‌తో 559 పరుగులు చేశాడు. గిల్ 15 మ్యాచుల్లో 155 కంటే ఎక్కువ స్ట్రయిక్ రేట్‌తో 650 పరుగులు చేరశాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్‌కు దిగే సాయి సుదర్శన్ సైతం 156 స్ట్రయిక్ రేట్‌తో 759 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఈ ముగ్గురికి టీ20 జట్టులో చోటు కల్పిస్తారా? లేదా ఉన్నది చూడాల్సిందే. ఆసియా కప్‌లో ఆడే ప్లేయర్స్ అంతా ఫైనల్ వరకు 21 రోజులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.
ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేయనుండగా.. ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్‌ను సెలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించన్నట్లు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. ఆసియా కప్ యూఏసీలో ఆసియా కప్ జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ని బట్టి చూస్తే యశస్వి, గిల్, సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్లో కీలక ఆటగాళ్లు అయ్యే అవకాశం ఉంది. సాయి సుదర్శన్ టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే, టీమిండియాకు బౌలింగ్ విభాగంలో ఇబ్బందికరంగా మారింది. కీలక టోర్నీకి ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ తర్వాత వెంటనే వెస్టిండిస్‌తో సిరీస్ నేపథ్యంలో వీరి విషయంలో సెలెక్టర్లు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు ఫిట్నెస్ను సైతం అంచనా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.