న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్( Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న టెస్టులో రెండో రోజు తొలి సెషన్లో అతను 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఫుల్ అండ్ ఆఫ్‌లో పడిన బంతిని జైస్వాల్ మిడాఫ్ దిశగా డ్రైవ్ చేశాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న శుభమన్ గిల్ పరుగు కోసం ముందుకు రాలేదు. కానీ జైస్వాల్ మాత్రం సగం క్రీజ్ వరకు వెళ్లాడు. మళ్లీ క్రీజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న చందర్‌పాల్ ఆ బంతిని అందుకుని కీపర్ దిశగా విసిరేశాడు. దీంతో అతను రనౌట్ అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది. నితీశ్ 10, గిల్ 39 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Mindless running from Jaiswal after hitting straight to fielder resulting in run out.
He did the same thing in Melbourne too when he was batting with Virat Kohli.
Bottled an easy 100 there & now a 200 here#YashasviJaiswal #INDvWI #TeamIndia pic.twitter.com/BvKygFeKUL
— Prateek (@prateek_295) October 11, 2025