ముంబై : టీమ్ఇండియా యువ ఓపెనర్, ముంబైలో క్రికెట్ ఓనమాలు నేర్చుకుని జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ దేశవాళీలో ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు అతడు తనను జట్టు నుంచి రిలీవ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వాలని మంగళవారం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు లేఖ రాయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. జైస్వాల్ అభ్యర్థనను ఎంసీఏ అంగీకరించింది. రాబోయే సీజన్ (2025-26) నుంచి జైస్వాల్ గోవా తరఫున ఆడనున్నాడు. జాతీయ జట్టు బాధ్యతలు లేనప్పుడు అతడు గోవాకు సారథిగా వ్యవహరించనున్నట్టు గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంబా దేశాయ్ తెలిపాడు. 2019 నుంచి ముంబైకి ఆడుతున్న జైస్వాల్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 63 మ్యాచ్‌లు ఆడాడు.