Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. ఇంగ్లండ్ సిరీస్(England Sereis)లో దంచికొడుతున్న యశస్వీ టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధర్మశాల టెస్టులో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది యశస్వీ ఈ మైలురాయికి చేరువయ్యాడు. దాంతో, తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ చిచ్చరపిడుగు 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(Vinod Kambli) 14 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి రన్స్ కొట్టాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు కొట్టిన ఛతేశ్వర్ పూజారా మూడో స్థానానికి పడిపోయాడు.
🚨 Milestone 🔓
1⃣0⃣0⃣0⃣ Test runs and counting 🙌
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/mjQ9OyOeQF
— BCCI (@BCCI) March 7, 2024
నిరుడు టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వీ విధ్వసంక ఇన్నింగ్స్‌లతో దిగ్గజాలకు సవాల్ విసిరాడు. తన కచ్చితమైన ఫుట్‌వర్క్, టైమింగ్‌తో చెలరేగుతున్న యశస్వీ తక్కువ మ్యాచుల్లోనే వెయ్యి రన్స్ బాదిన ఐదో ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 7 మ్యాచుల్లోనే ఈ మైలురాయికు చేరుకోగా.. యశస్వీ 9 వ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఎవర్టన్ వీకెస్, హెర్బెర్ట్ సట్క్లిఫె, జార్జ్ హెడ్లేలు 9 మ్యాచుల్లో వెయ్యి రన్స్ కొట్టారు.
అత్యంత చిన్నవయసులోనే టెస్టుల్లో వెయ్యి రన్స్ కొట్టిన యశస్వీ.. మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 19 ఏండ్ల 217 రోజుల్లో వెయ్యి పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. యశస్వీ 22 ఏండ్ల 70 రోజుల్లో వెయ్యి రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
1000 runs in no time – Yashasvi Jaiswal is making Test cricket look easy 🔥 pic.twitter.com/Ta3jGOGNeG
— ESPNcricinfo (@ESPNcricinfo) March 7, 2024
భారత దిగ్గజం కపిల్ దేవ్ 21 ఏండ్ల 27 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు బ్యాటింగ్ యావరేజ్లోనూ యశస్వీ రికార్డులు బ్రేక్ చేశాడు. వినోద్ కాంబ్లీ 83.33 సగటుతో టాప్‌లో నిలవగా.. యశస్వీ 71.43 సగటుతో మూడో స్థానం దక్కించుకున్నాడు.