IPL 2025 : సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ పెద్ద స్కోర్ కొట్టలేకపోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (75) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగినా మిగతా బ్యాటర్లు దంచలేకపోయారు. పవర్ ప్లేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్‌కు అదిరే శుభారంభం దక్కలేదు. అయితే.. యశస్వీ జతగా రియాన్ పరాగ్(30) ధనాధన్ ఆడాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్(35 నాటౌట్) పోరాడడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ నిదానంగా మొదలైంది. పవర్ ప్లేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో, రాజస్థాన్ ఓపెనర్లు సంజూ శాంసన్(15), యశస్వీ జైస్వాల్(75 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ధాటిగా ఆడలేకపోయారు. ఓవర్‌కు ఒక బౌండరీ చొప్పున సాధించగా.. 45 రన్స్ మాత్రమే వచ్చాయి. అయితే.. ఆ తర్వాత దూకుడు పెంచాలనుకున్న శాసన్ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి సంజూ ఔటవ్వడంతో తొలి వికెట్ 49 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత రియాన్ పరాగ్(0) సహకారంతో యశస్వీ దూకుడుగా ఆడాడు.
𝘊𝘩𝘦𝘦𝘬𝘺, 𝘤𝘭𝘢𝘴𝘴𝘺, 𝘑𝘢𝘪𝘴𝘸𝘢𝘭! 💫
🎥 A glimpse of Yashasvi Jaiswal before he was dismissed for a well-made 75 (47) 💪
Updates ▶ https://t.co/rqkY49M8lt#TATAIPL | #RRvRCB | @rajasthanroyals | @ybj_19 pic.twitter.com/v7ug36kgrm
— IndianPremierLeague (@IPL) April 13, 2025
శాంసన్ వికెట్ పడ్డాక రాజస్థాన్ స్కోర్ వేగం తగ్గింది. అయితే.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సింగిల్ తీసి యశస్వీ అర్థ శతకం సాధించాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన యశస్వీ యాభైకి చేరువయ్యాడు. రియాన్ పరాగ్(30)తో 55 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించాడు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడడంతో 13 ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 104 రన్స్ చేసింది. అయితే.. యశ్ దయాల్ బౌలింగ్‌లో పరాగ్ కవర్స్‌లో విరాట్ కోహ్లీకి సులవైన క్యాచ్ ఇచ్చాడు. అర్ద శతకం తర్వాత జోరు పెంచి ఆడుతున్న యశస్వీని హేజిల్‌వుడ్ ఎల్బీగా ఔట్ చేసి.. రాజస్థాన్ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివర్లో ధ్రువ్ జురెల్(35 నాటౌట్), హెట్‌మైర్(9)లు ధాటిగా ఆడారు. 20వ ఓవర్లో ఆఖరి బంతిని నితీశ్ రానా(4 నాటౌట్) బౌండరీ సాధించడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 173 పరుగులకే పరిమితమైంది.